సర్పంచ్ లది కూలీ పనులు చేసే దుస్థితి : బండి సంజయ్

-

కరీంనగర్లో సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని.. నూతన పంచాయతీ భవనాలు ప్రారంభించుకోకుండా సర్కులర్ ఇవ్వడమా..? అని అన్నారు బండి సంజయ్. ఆయన మీడియాతో మాట్లాడారు. కూలి పనులు చేసే దుస్థితి సర్పంచులది ఇదే ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. నేను సీఎంకు లేక రాసిన స్పందన లేదన్నారు. టిఆర్ఎస్ మాదిరిగానే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తుందని.. చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు కనీసం రికార్డుల్లోకి ఎక్కి ఇవ్వరా అని మండిపడ్డారు. అలాగే అయితే సర్పంచులుగా పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని.. కాంగ్రెస్ నుంచి సర్పంచిగా పోటీ చేయరని తక్షణమే పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేయండి అన్నారు బండి సంజయ్. నూతన భవనాలను ప్రారంభించుకునే అవకాశం ఇవ్వండి అని విపక్షాలకు నిర్మాణాత్మక సూచనలు పరిగణలోకి తీసుకోండి అని సూచించారు.

లేనిపక్షంలో మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలోని స్వయంభు శ్రీ మల్లికార్జున స్వామిని బిజెపి ప్రధాన కార్యదర్శి ఎం పి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన బండి సంజయ్ కు మైలారం గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు

Read more RELATED
Recommended to you

Exit mobile version