రేపు మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు రాష్ట్రానికి చేరుకోనున్న మోదీ మహబూబ్​నగర్​లో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మళ్లీ 3వ తేదీన నిజామాబాద్​లో పర్యటిస్తారు. మోదీ మహబూబ్​నగర్, నిజామాబాద్ జిల్లాల పర్యటన షెడ్యూల్​ను రాష్ట్ర బీజేపీ విడుదల చేసింది.

మోదీ మహబూబ్​నగర్ పర్యటన షెడ్యూల్

  • రేపు ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
  • అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్​నగర్‌కు బయలుదేరతారు.
  • మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్​నగర్‌కు చేరుకుంటారు.
  • 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
  • బహిరంగ సభా స్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారాం పూరిస్తారు.
  • అనంతరం తిరిగి దిల్లీకి పయవమవుతారు. సాయంత్రం 4.45 గంటలకు దిల్లీకి వెళ్తారు.

మోదీ నిజామాాబాద్ పర్యటన షెడ్యూల్

  • అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 2:55కి నిజామాబాద్​కు చేరుకుంటారు.
  • 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
  • 3:45 నుంచి 4:45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
  • సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బీదర్‌ బయలుదేరి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version