పోలీసులతో అమర్యాద వ్యవహరిస్తూ… దుర్భాషలాడిన కేసులో జీహెచ్ఎంసీ భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేట గౌసుద్దీన్ ను అరెస్ట్ చేశారు ముషీరాబాద్ పోలీసులు. అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. గత అర్థరాత్రి సమయంలో గస్తీ చేస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు కార్పొరేటర్. ‘‘ మీ డ్యూటీ మీరు చేసుకోండి, కార్పొరేటర్ వచ్చిండంటూ చెప్పు, పోలీసులు 100 రూపాయల మనుషులు అని వివాాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నెటింట్లో వైరల్ గా మారింది. అయితే ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై సదరు కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సదరు ఎంఐఎం కార్పొరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. రాజకీయాలు అతీతంగా తెలంగాణలో ఇలాంటి చర్యలను సహించకూడదని ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలు కూడా ప్రారంభం అయ్యాయి.