నాగర్‌ కర్నూల్‌ లో కలకలం…గ్రామానికి రాకుండా ముళ్ళకంచె !

-

మైనింగ్ వద్దు అన్నందుకు రైతులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. దీంతో మందు డబ్బులతో మహిళా రైతులు..రోడ్డెక్కారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో గ్రామస్తులను, రైతులని అక్రమంగా అరెస్టు చేశారు పోలీసులు. అయితే…. పోలీసులు గ్రామానికి రాకుండా ముళ్ళకంచె ఏర్పాటు చేశారు మహిళలు. స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో మల్యాల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు గ్రామస్తులు.


మా గ్రామంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్న రైతులను మహిళలను తెల్లవారుజామున 5గంటలకే పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అక్రమంగా అరెస్టు చేసిన గ్రామస్తులను తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికి అయినా సిద్ధమని తేల్చి చెబుతున్నారు గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Latest news