కాంగ్రెస్ పాలనలో అన్ని కోతలే : కేటీఆర్ ట్వీట్ వైరల్

-

రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆయన మరోసారి గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సాగు నీళ్లలోనూ కోత పెట్టారని ఆరోపించారు. గర్భిణులకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌ను సైతం ఇవ్వడం లేదన్నారు.

‘మహిళలకు తులం బంగారం, రూ.2,500 కోత పెట్టారని, ఆసరా ఫింఛన్లు రూ.4 వేలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, అమరవీరులకు రూ.25వేల పింఛను, ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా ఎక్కడ పోయాయి. నిరుద్యోగ యువతకు రూ.4 వేల భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలకు పెంపు అనేవి కల్లలుగానే మిగిలాయని’ ఆయన ఘాటువ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news