SLBC టన్నెల్ వద్ద పోలీసు ఆంక్షలు అమలు లో ఉన్నాయి. హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వస్తున్న నేపథ్యంలో SLBC టన్నెల్ వద్ద పోలీసు ఆంక్షలు అమలు చేస్తున్నారు. మీడియా, పొలిటికల్ లీడర్స్ ఎవ్వరినీ టన్నెల్ వద్దకు రానివ్వద్దని పోలీసులకు పై నుండి ఆదేశాలు వచ్చాయి.
టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో ఫెయిల్యూర్ వంటి అంశాలు బయటికి వస్తాయనే దానిపై సీఎం, మంత్రుల సమాలోచనలు చేస్తున్నారు. SLBC టన్నెల్ ప్రమాద ఘటన జరిగి ఇన్నిరోజులు అవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. వాళ్లను వేగవంతంగా బైటకు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. రాజకీయాలు చేయకుండా వాళ్ల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్ద కూర్చొని బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ ఢిల్లీలో కూర్చొని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు.. మీరు బీఆర్ఎస్ పార్టీను విమర్శించడానికి ఇది సమయమా అంటూ నిలదీశారు.