బోల్తా పడ్డ టమాటాల వ్యాను .. బందోబస్తుగా పోలీసులు

-

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు టమాట. టమాట ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటడమే దీనికి కారణం. ఈ క్రమంలోనే టమాట చుట్టూ రకరకాల కథనాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా టమాటాలను దొంగిలిస్తున్నారు. తాజాగా టమాటాలు తీసుకువెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో పోలీసులు టమాటాలకు బందోబస్తు నిర్వహించారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..?

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామెల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రూ.11 లక్షల విలువైన టమాటా లోడ్‌తో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి బోల్తాపడింది. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు లారీలో చిక్కుకున్న డ్రైవర్‌ తిమ్మప్పను బయటకు తీశారు. టమాటా లారీ బోల్తా పడిందన్న వార్త తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి పరుగెత్తుకు వచ్చారు. అయితే అప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టమాటాలు తీసుకెళ్లకుండా బందోబస్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version