ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా..?

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకవైపు టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే సినిమాలను చేస్తూనే మరొక పక్క బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా యష్ రాజ్ ఫిలిమ్స్ వారి యాక్షన్ ఎంటర్టైనర్ వార్ -2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచీ వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ బాలీవుడ్ మొదటి ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పోతే ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎవరు ఊహించి ఉండరు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే యుద్ధ భూమిలో ఎన్టీఆర్ కోసం హృతిక్ రోషన్ ఎదురుచూస్తున్నట్లుగా రివీల్ చేశారు ఒకవైపు వై ఆర్ ఎఫ్ భారీ సినిమాలు ఖాన్ హీరోలతో నిర్మిస్తూనే ఈ కాంబినేషన్ ను తీసుకురావడం జరిగింది. అయితే వై ఆర్ ఎఫ్ ఎక్కువగా సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్, షారుక్ ఖాన్ వంటి కొంతమంది బాలీవుడ్ హీరోలతో మాత్రమే సినిమాలను చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి యంగ్ టైగర్ కూడా చేరిపోయారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చిత్రాన్ని హిందీ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ క్రేజీ నడుము ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఒకవేళ ఈ సినిమా కూడా తెలుగులో మెప్పించలేపోకపోతే.. కనీసం ఎన్టీఆర్ క్రేజ్ తగ్గట్టుగా అయినా కలెక్షన్స్ వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా క్రేజ్ ని యెన్ క్యాష్ చేసుకునేందుకు తారక్ ని వై ఆర్ ఎఫ్ ఓ ఒక పావులా వినియోగించు కుంటోందని ఒక వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. కలెక్షన్ల కోసం ఇప్పుడు ఈయనను ఒక పావులాగా వాడుకుంటున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version