తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఆరోగ్య శ్రీ లో రూ.10లక్షల వరకు పెంపు వంటివి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆగస్టు 15వరకు రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తానని హామి ఇచ్చారు. హామీ మేరకే అమలు చేశారు. కొన్ని సాంకేతిక టెక్నికల్ కి సంబంధించిన వారికి మాత్రం రుణమాఫీ కాలేదు. వారికి కూడా చేస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ రుణ మాఫీ సరిగ్గా జరగలేదని.. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలని రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తిరుమలగిరిలో బీఅర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల రాళ్ళ డాడి నేపథ్యంలో తమ పార్టీ నేతలను పరామర్శించేందుకు బయలు దేరారు జగదీష్ రెడ్డి. తిరుమలగిరికి వెళ్లొద్దని జగదీష్ రెడ్డి ని అడ్డుకున్నారు పోలీసులు. శాంతి భద్రతల సమస్య వస్తుందని జగదీష్ రెడ్డికి పోలీసుల విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమక్షంలోనే తమ పార్టీ కార్యకర్తల పై దాడి జరిగిందనీ జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు జగదీష్ రెడ్డి.