తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు.. అలాగే తెలంగాణలో 17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అయింది.
ఇక ఇప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ లో 67.99 శాతం పోలింగ్ నమోదవ్వగా.. తెలంగాణలో 61.16 శాతం పోలింగ్ నమోదు అయింది. తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో నమోదు కావడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినప్పటికీ.. ఇబ్బందులు ఎదురైనా ఓపికగా నిరీక్షిస్తున్న ఓటర్ల పై ప్రసంసలు కురుస్తున్నాయి. కొందరూ మాత్రం వర్షం కారణంగా ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు.