కాంగ్రెస్‌ లోకి వెళ్లడంపై పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన ప్రకటన

-

కాంగ్రెస్‌ లోకి వెళ్లడంపై పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ తన అనుచరులతో సమావేశం అయ్యారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర యుద్ధం ప్రకటించి 5 నెలల దాటిందని వ్యాఖ్యానించారు. అనేకులు అవాకులు చవాకులు పేల్చారని మండిపడ్డారు.

మీ గుర్తే మీకు తెలియదు అంటూ ఎగతాళిగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. కాలానికి అనుగుణంగా నేను నడుస్తానని… ఒక్క పార్టీలోనికి వెళతారని ప్రచారం జరిగినప్పుడు సంబరాలు చేసుకున్నారన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. కళ్లు ఉండి… కూడా చూడలేక పోతున్నారు. నా వంశ పారపర్యంగా నాదే అంటూ విర్ర విగుతున్నారని మండిపడ్డారు పొంగులేటి.

కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులతో రహస్య భేటీ అయ్యారు. ఏ పార్టీలో చేరాలని అనుచరులుల అభిప్రాయం సేకరిస్తున్నారు పొంగులేటి. కాంగ్రెసులో చేరితేనే బాగుంటుంది అంటూ కోరుతున్న అనుచరులు… పొంగులేటి ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version