కేసీఆర్ సర్కార్ పై పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశఆరు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి మేలు జరుగుతుందని.. సీఎం కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ఏ ఒకటి నెరవేర్చలేదని ఆగ్రహించారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిరుపేదలకు ఇవ్వలేదు..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటించేశారు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని..నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుసుకున్న ప్రజల కష్టాలు నెరవేరేలా కృషి చేస్తారు… బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అన్నారు. 500 రూపాయల కే గ్యాస్ ను అందజేస్తామని.. ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తామన్నారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి.