హోంగార్డు ఆత్మహత్య… ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే !

-

హోంగార్డు రవీందర్ మృతిపట్ల కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్.. చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని..రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వెల్లడించారు.

ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని.. హోంగార్డులకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా.. వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహించారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హోంగార్డులకు విజ్ఞప్తి…తొందరపడొద్దు. ఆత్మహత్యలే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదన్నారు. పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకొవద్దని కోరారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version