డిసెంబర్ 23వ తేదీ..ఇక సింగరేణి కార్మికులకు సెలవు దినం – పొంగులేటి

-

డిసెంబర్ 23వ తేదీ..ఇక సింగరేణి కార్మికులకు సెలవు దినం అన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం PVK-5 ఇంక్లైన్ ఏరియాలో పాల్గొని ఐ.ఎన్.టి.యు.సి తరఫున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐ.ఎన్.టి.యు.సి ప్రధాన కార్యదర్శి నటరాజన్ తదితరులు…ప్రచారం నిర్వహించారు. సింగరేణి ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..
2017 సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కేసీఆర్ మాటలు నమ్మి నేను మోసపోయాను, మీరు మోసపోయారు.

Minister Ponguleti Srinivas Reddy on indhiramma

సింగరేణి ఎన్నికల్లో గెలిపించిన తర్వాత మీ కష్టాలు విన్నవించుకునే సందర్భం కూడా మనకు దొరకపోవడం దురదృష్టం అన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సింగరేణి 12 ఏరియాలో 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగింది…ఏ.ఐ.టీ.యూ.సీ యూనియన్ కు చెందిన నాయకున్ని మొన్ననే మనం కొత్తగూడెంలో గెలిపించుకోవడం జరిగింది.

నేను కూడా వారి గెలుపు కోసం మాట్లాడి ప్రచారం చేయటం జరిగింది కానీ వారు మాత్రం మేము సొంతగా పోటీ చేస్తామంటూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నాను కాబట్టి కార్మికుల సొంతింటి కల కోసం 250 గజాల ఇళ్లస్థలం, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 23 వ తారీకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు సెలవు దినం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news