సీఎం రేవంత్​కు జ్వరం.. ఆర్టీపీసీఆర్ టెస్టు చేయనున్న వైద్యులు

-

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొవిడ్ న్యూ వేరియంట్ జేఎన్1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న సీఎం ప్రస్తుతం ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న రేవంత్కు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయితే ఇటీవల సీఎంతో పాటు సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా సీఎం రేవంత్ ఆదివారం రోజున కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఒకవేళ ఆయనకు కొవిడ్ నిర్ధారణ అయితే ఈ అధికారులంతా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తనతో గత రెండు రోజుల పాటు కాంటాక్ట్లో ఉండి అస్వస్థతకు గురైన వారు ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలని.. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సీఎం రేవంత్ సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news