పింక్‌ కలర్‌ ముసుగు వేసుకున్న దోషులను మీడియా ముందు పెడుతాం – పొంగులేటి

-

పింక్‌ కలర్‌ ముసుగు వేసుకున్న దోషులను మీడియా ముందు పెడుతామని వికారాబాద్‌ ఇష్యూపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి కొద్ది గంటల లోనే వికారాబాద్ దోషులను మీడియా ముందు పెడుతామన్నారు. రైతుల ముసుగులో పింక్ కలర్ ముసుగు వేసుకొని కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.

ponguleti on kodangal issue

ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న అధికారులను, ప్రభుత్వాన్ని పింక్ కలర్ ముసుగు అడ్డు పెట్టుకొని కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల అనే పేరు ముందు పెట్టి ముసుగు వెనక ఎవరు ఉన్నారో బయటపెడుతామని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయని… నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన అప్పు కు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version