ఖమ్మం వరద బాధితులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితుల అకౌంట్లో డబ్బులు వేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల 358 గ్రామాల్లో… జనాలు నిరాశ్రయులు అయ్యారు. ఈ నేపథ్యంలో 358 గ్రామాలలో దాదాపు రెండు లక్షల మంది నష్టపోయారని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
అయితే వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి.. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే వరద బాధిత కుటుంబ సభ్యుల అకౌంట్లో 16,500 జమ చేస్తామని కూడా వివరించారు. అయితే ఈ డబ్బులు పంపిణీ విషయంలో అవినీతి అలాగే అక్రమాలకు తావు లేకుండా… సహాయం అందిస్తామని కూడా వివరించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే బాధితుల అకౌంట్ లోకి నేరుగా డబ్బులు వేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డు, భూమి పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఇలా కోల్పోయిన వారు వెంటనే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలా చేసిన వారికి… కొత్త సర్టిఫికెట్లు ఇస్తామని కూడా వెల్లడించారు.