రెండు నెలల్లో ఖేల్ ఖతం దుఖాన్ బంద్ అంటూ పువ్వాడపై పొంగులేటి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ పై పరోక్షంగా కార్యకర్తల సమావేశంలో పొంగులేటి కామెంట్స్ చేశారు. అధికారం మదంతో కొంత వ్యవహరిస్తున్నారని.. కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎవరి కష్టార్జితం వారిని అనుభవించనియ్యకుండా చేస్తున్నారని… 200 గజాల స్థలం కొంటే… ఆ స్థలం ఐదేళ్ల తర్వాత వారి చేతిలో ఉండని పరిస్థితి ఖమ్మం లో ఉందని విమర్శలు చేశారు.
గడిచిన 5 ఏళ్లలో మీతో పాటు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని… అధికార మదంతో సామాన్యుల ఇంటి స్థలాలు కబ్జా చేశారని మండిపడ్డారు. వ్యాపారం,కాంట్రాక్టు లు కూడా వాల్లే చేయలట..ఇంకో రెండు నెలల్లో కూకటి వేళ్ళతో పెకిలిస్తామని హెచ్చరించారు. ప్రజల దీవెనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సోకిన నిరంకుశ పాలనను పాలిస్తున్న ఘడీలను తాల్లం వేసి ఇంటికి పంపుడే అంటూ కేసీఆర్ కు చురకలు అంటించారు. ఈ రెండు నెలలు ఇబ్బందులు ఉంటాయి భరించాలి..రాబోయేది మన ప్రభుత్వమే అన్నారు.