ఆ ఆధారాలు చూపిస్తే సజీవదహనం చేసుకుంటా – పొన్నం సవాల్‌

-

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాముడి గురించి నేను అనని మాటలు అన్నట్టు సంజయ్ చెబుతున్నారు.. ఆధారాలు చూపిస్తే సజీవదహనం చేసుకుంటానని సవాల్‌ చేశారు పొన్నం. రాముని అక్షింతల గురించి నేను మాట్లాడితే పత్రికలు రాయకపోయేవా..? అంటూ నిలదీశారు. బతికి ఉన్న నా తల్లిని ఆత్మ క్షోభిస్తుంది అన్నావు… తల్లి ఎవరైనా తల్లే… తల్లి గురించి తప్పుడు మాటలు మాట్లాడి అనలేదు అంటావా సంజయ్? అంటూ మండిపడ్డారు.

bandi sanjay vs ponnam

మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన నువ్వు రాజకీయ సన్యాసం గురించి మాట్లాడతావా? అంటూ నిప్పులు చెరిగారు. నీకంటే పదేళ్ల ముందే నేను ఎంపీని అయ్యాను…నా దయా దక్షిణ్యాల మీద అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావు అంటూ చురకలు అంటించారు. నేను వెజిటేరియన్ ని హిందువుని… బండి సంజయ్ పొద్దున లేస్తే మాంసం మద్యం లేకుండా బతకడు… నువ్వు భక్తి గురించి మాట్లాడతావా అంటూ నిప్పులు చెరిగారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Exit mobile version