ఓటుకు నోటు కేసు పాతది..ఫోన్​ ట్యాపింగ్​ పై చర్చకు రండి : పొన్నం సవాల్

-

ఓటుకు నోటు కేసులో గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఏం చేయలేక పోయాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు పాత చింతకాయ పచ్చడి అని ప్రస్తుతం ఫోన్​ ట్యాపింగ్ కేసు ట్రెండింగ్ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్​, ఓటుకు నోటు కేసులపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు.

 కరీంనగర్​ అంబేడ్కర్​ స్టేడియంలో ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న వెలిచార రాజేందర్​తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన నంత్రి పొన్నం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు.  ప్రచారంలో తన తల్లి ప్రస్తావన తీసుకువచ్చి, సెంటిమెంట్​తో ఓట్లు పొందేందుకు బండి యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రాజకీయాలకు సంబంధం లేని తల్లి గురించి ప్రచారంలో ప్రస్తావించడం సరికాదు. ప్రతిసారి ఎన్నికల ముందు ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి, ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్​లో వినోద్​రావును ఓడించడానికి బండి సంజయ్​, గంగుల కమలాకర్​కు మధ్య చీకటి ఒప్పందాలు అయ్యాయి.’ అని పొన్నం ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version