ఆ కార్మికులకు రూ.12,000 ఇస్తాం: మంత్రి పొన్నం

-

తెలంగాన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన చేశారు. ఆటో కార్మికులకు రూ.12,000 ఇస్తామని ప్రకటించారు. BRS పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తుందని… ఆటో కార్మికుల పై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటి…? చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటో ల పై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు అన్నారు తెలంగాన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Ponnam Prabhakar
Ponnam Prabhakar

బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదని… గతంలో లాగానే బస్సు స్టాండ్ నుండి పోతుందని వెల్లడించారు. ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్సు స్టాండ్ కి వెళ్ళడానికి ఆటో లను వాడుతున్నారు…. ఎన్నికలలో ఆటో కార్మికులకు 12 వేలు సంవత్సరానికి ఇస్తామని అన్నామన్నారు. మీ నిర్వాకం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయామ్…. భవిష్యత్ లో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉందని క్లారిటీ ఇచ్చారు తెలంగాన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Read more RELATED
Recommended to you

Latest news