సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిద్దేశ్వర స్వామి కి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కు చెల్లించుకున్నారు. ఎన్నికల్లో గెలిస్తే.. స్వామి వారికి రుద్ర కవచం చేయిస్తానని మొక్కుకున్న పొన్నం ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి తన మొక్కు తీర్చుకున్నారు.
సిద్దేశ్వర స్వామికి 6కిలోల వెండితో చేసిన రుద్ర కవచాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం నిర్వహించారు. ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.