తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో కూడా భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ కార్యకర్తను కలవడానికి వచ్చాను..కేసీఆర్ కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారు..
చూద్దామని వెళ్లానని వెల్లడించారు. కేసీఆర్ కు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది.. అందుకే కేసీఆర్ ను కలవలేదన్నారు. కేటీఆర్, హరీష్ రావులు లోపల ఉన్నారు.. వారిని అడిగి కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్.