పూల్ స్టార్టప్ : సహజ వస్తువులకు ప్రత్యేకం..!

ఈ మధ్యకాలంలో చాలా మంది యువత బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే చాలా మంది వేరే వాళ్ల బిజినెస్ ను కాపీ కొట్టి వ్యాపారాలు చేస్తుంటారు. కొత్త ఆలోచనలతో, వినూత్నంగా వ్యాపారాలు చేసే వాళ్లే అరుదు. వాణిజ్యరంగాల్లో అలాంటి వారికే ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం వల్ల నలుగురికి ఉపాధి చేకూరాలి. దీంతో పాటుగా పర్యావరణాకి హాని కలగకుండా ఉండాలి. అలాంటి బిజినెస్ చేస్తేనే ఆ వ్యాపారం మార్కెట్ లో క్లిక్ అవుతుంది.

flower
flower

బిజినెస్ స్టార్ట్ చేస్తే వంద ప్రశ్నలు, వంద ఆలోచనలు. ఎలాంటి బిజినెస్ చేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టాలి.. ఈ బిజినెస్ చేస్తే లాభాలొస్తాయా.. మార్కెట్ లో క్లిక్ అవుతాయా అనే ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే మీరో స్టార్టప్ గురించి తెలుసుకోవాలి. బిజినెస్ చేసి వ్యాపారం విస్తృతం చేసుకోవాలని భావిస్తే పూల్ (PHOOL) స్టార్టప్ గురించి తప్పకుండా తెలిసి ఉండాలి. డబ్బులు, లాభంతో పాటు సమాజం, మహిళలు, పర్యావరణం వంటి అంశాలపై అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ స్టార్టప్ పుట్టుకొచ్చింది. ఈ స్టార్టప్ ను అంకిత్ అగర్వాల్ అనే వ్యక్తి స్థాపించాడు.

పూల్ స్టార్టప్ చాలా ప్రత్యేకమైనది. పనికిరాని వస్తువుల ద్వారా మళ్లీ అందరూ ఉపయోగించే ప్రొడక్టులను తయారు చేస్తుంటారు. గుడిలో వాడిపోయిన పూలను చాలా మంది నదిలో పడేస్తుంటారు. దీని వల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది. పూలల్లో ఉన్న క్రిమిసంహారకాలు నీటిలో కలిసి.. ఆ నీరును స్థానికులు తాగి అనారోగ్య బారిన పడుతుంటారు. ఈ ప్రభావం మత్స్యకారులపై పడుతుంది.

అయితే నదిలో కాలుష్యాన్ని తగ్గించాలని భావించిన అంకిత్ ఆ దిశగా ఆలోచనలకు అడుగులు వేశాడు. స్నేహితులతో కలిసి ఉత్తరప్రదేశ్ లో ఉన్న అన్ని దేవాలయాల దగ్గరికి వెళ్లి అక్కడి వేస్టేజ్ మేనేజ్ మెంట్ తో సమావేశమయ్యాడు. దేవాలయాల్లో వాడిపోయిన పూలను సేకరించి.. వాటితో అగరబత్తులను, ఇతర ప్రొడక్టులను తయారు చేయడం ప్రారంభించాడు.

అయితే ఈ ప్రొడక్ట్స్ ఉత్పత్తిలో మరో ప్రత్యేకత ఉంది. ఈ స్టార్టప్ లో పని చేసేవారంతా మహిళలే. సమాజంలో వివక్షకు గురవుతున్న అట్టడుగు వర్గాల వారు పనిచేస్తున్నారు. వీరికి ఇన్సూరెన్స్, హెల్త్ బెనిఫిట్స్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాడు అంకిత్. రూ.290కి పైగా కొనుగోలు చేస్తే ఫ్రీ డెలివరీ పొందొచ్చు. దేశవ్యాప్తంగా డెలివరీ ఫెసిలిటీ ఉంది. సికింద్రాబాద్ లోకూడా దీని బ్రాంబ్ ఉంది.