పొంగులేటి అనుచరులను చంపి.. శవాలు లేకుండా చేస్తామని పోస్టర్ల కలకలం !

-

పొంగులేటి అనుచరులను చంపి.. శవాలు లేకుండా చేస్తామని పోస్టర్ల కలకలం రేపాయి. అయితే… ఈ పోస్టర్లపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నానని నా అనుచరులను చంపి శవాలు లేకుండా చేస్తామని అధికార పార్టీ నేతలు పోస్టర్లు వేయడం దుర్మార్గం అని ఆగ్రహించారు. నన్ను నమ్ముకున్న వాళ్ల ను కాపాడుకోవడం తప్పా?? అని ప్రశ్నించారు.

నేను చెల్లని నాణాన్నా..లేక గోల్డ్ కాయినా అన్నది BRS కు మూడున్నర నెలల్లో చూపిస్తానని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ చేరడానికి ముందు ఐదు నెలల పాటు సొంత సర్వేలు చేయుంచుకున్న తర్వాతనే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. జనగర్జన సభకు బస్సులివ్వండి రెండు కోట్ల రూపాయలు కడతానని చెప్పిన సభకు జనాలను రానివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహించారు. రాహుల్ సభ ముగిసేంతవరకు మంచినీళ్ల సరఫరా ఆపేస్తామని బెదిరిస్తున్నారు..ఎవరెన్ని చేసిన ఖమ్మం లో జనగర్జన సభ సక్సెస్ అవుతుంది..కేసీఆర్ ఈ సారి ఓటమి తప్పదని హెచ్చరించారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news