ప్రజాభవన్ లోపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకు ఈ భవనం మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటాయించారు. దీంతో బిల్డింగ్ లోపలి వీడియో బయటకు వచ్చింది. విశాలమైన హాల్, డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరమిట్లు గొలిపే లైటింగ్ తో ఇంద్రభవనాన్ని తలపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను ఆడంబరాలకు పోదల్చుకోలేదని..తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకొని దుబారాను తగ్గించాలనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఓ ఎకరం స్థలంలో షెడ్డులో ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని.. అందువల్లనే ఒక షెడ్డును కట్టించుకొని దానినే క్యాంపు ఆఫీస్ గా వాడుకుంటానని తెలిపారు.