ప్రీతిది ఆత్మహత్యే – తండ్రి నరేందర్ ప్రకటన

-

ప్రీతిది ఆత్మహత్యేనని ఆమె తండ్రి నరేందర్ వెల్లడించారు. వరంగల్ సిపి రంగనాథ్ ను ఇవాళ ప్రీతి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ప్రీతి తండ్రి నరేందర్ మాట్లాడుతూ, సిపి తో మాట్లాడి మా అ‌నుమానాలు నివృత్తి చేసుకున్నామని.. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని ప్రకటించారు.

సిరంజి దొరికిందని సిపి చెప్పారు.. ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు చెప్పారన్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సిపి చెప్పారు… కానీ రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నాం.. చార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని చెప్పారని వెల్లడించారు. కె ఎం సి ప్రిన్సిపాల్, హెచ్ ఓడి ల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటు‌న్నామన్నారు ప్రీతి తండ్రి నరేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version