నిండు గర్భిణిని 200 కిలోమీటర్లు తిప్పి చంపేశారు…!

-

నిండు గర్భిణి విషయంలో కొందరు చేసిన తప్పు ఆమె ప్రాణాలు తీసింది. నిండు గర్భిణి అయినా సరే ఆ పరీక్షా ఈ పరీక్షా అంటూ ఆమెను 200 కిలోమీటర్లకు పైగా తిప్పడం ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ ఘటన తెలంగాణాలోని జోగులాంభ గద్వాల జిల్లాలో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నె ప్రాంతానికి చెందిన జెనీలా(20సం.) నెలలు నిండటంతో కాన్పు కోసం జిల్లా ఆసుపత్రికి ఈ నెల 24న తీసుకుని వెళ్ళారు.

రక్తం తక్కువగా, బీపీ ఎక్కువగా ఉందంటూ కర్నూలు ఆసుపత్రికి వెళ్లాలని ఆమెకు అక్కడి వైద్యులు సూచించారు. ఇప్పుడు కర్నూలు సరిహద్దులను మూసి వేసారు. అటు వెళ్ళడం అసలు సాధ్యం కాని పని. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. వెంటనే ఆయన మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లేందుకు 102 వాహనం సిద్ధం చేయించి పంపగా… ఇక్కడికి వచ్చాక పరీక్షించిన వైద్యులు జెనీలా పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

కాన్పు కష్టం అయ్యే అవకాశం ఉంది వెంటనే హైదరాబాద్ కోఠి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని సూచించారు. గద్వాల్ జిల్లా కరోనా హాట్ స్పాట్ గా ఉంది కాబట్టి కోఠి ఆసుపత్రి వైద్యులు జెనీలాను ముందుగా కరోనా పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి పంపగా అక్కడ కరోనా నెగటివ్ అని వచ్చింది. మళ్లీ పేట్లబురుజు దవాఖానాకు తీసుకుని వెళ్ళగా అక్కడ శనివారం కాన్పు చేయగా మగబిడ్డ పుట్టాడు.

బాబుకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న నేపధ్యంలో నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యులు. అక్కడ చికిత్స పొందుతూ బాబు ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి నుంచి తల్లి ఆరోగ్యం క్రమంగా విషమించింది. పేట్లబురుజు ఆసుపత్రి నుంచి ఆదివారం ఆమెను ఉస్మానియాకు తరలించగా సోమవారం రాత్రి ;30 నిమిషాలకు ఆమె మరణించింది. ఇక్కడ ఎవరు తప్పు చేసారో తెలియదు నిండు ప్రాణం మాత్రం పోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version