పఠాన్ చెరులోని ఇక్రిశాట్ నుంచి బయలు దేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. నేరుగా ముచ్చింతల్ గ్రామానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. ఇక ముచ్చింతల్ గ్రామానికి ప్రధాని మోడీ చేరుకోగానే.. చిన జీయర్ స్వామి తో పాటు ఆయన బృందం.. ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీకి శాలువ, పట్టు వస్త్రాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం… యాగ శాలకి నరేంద్ర మోడీ చేరుకున్నారు.
యాగ శాలలో ప్రధాని మోడీ, చిన జీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గవర్నర్ తమిలిసై అందరూ దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. అక్కడి నుంచి సమతా మూర్తి విగ్రహ ప్రాంగణం బయలు దేరారు మోడీ. ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో… సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. విగ్రహం ఆవిష్కరించిన అనంతరం.. అక్కడి నేరుగా…. ఢిల్లీకి వెళ్లానున్నారు. ప్రత్యేక విమానంలో.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీ కి చేరుకోనున్నారు ప్రధాని మోడీ.