నేడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో జయశంకర్ లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన చేసిన కృషి అజరామరమైందని పేర్కొన్నారు. జయశంకర్ ఆకాంక్ష తెలంగాణ ప్రగతిలో అనునిత్యం ప్రతిబింబిస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ అమరుల స్ఫూర్తితో ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని తెలిపారు.
కాగా తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6 1934న జన్మించగా.. జూన్ 21 2011 న కన్నుమూశారు. ఆయన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్.. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు.