లాభాలు వచ్చే పంటలు వేయాలి.. రైతులకు పోచారం పిలుపు

-

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..తన విజ్ఞప్తిపై వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జీవో ఇచ్చారని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.గోదావరి నీళ్లు మంజీరా కు రావడం వల్లే జాకోరా లో లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమైందని అన్నారు.

లిఫ్ట్ నిర్మాణం పూర్తి అయితే ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని..త్వరలో చందూరు లిఫ్టు కు కూడా శంకుస్థాపన చేస్తాము అన్నారు.చింతకుంట లో కూడా మోటర్లు పెట్టి చెరువులు నింపుతామన్నారు.రెండు పంటలు పండించుకునే బాధ్యత రైతన్నలదే అన్నారు.నియోజకవర్గంలో మరింత సాగు నీరు అందిస్తే 1500 కోట్ల రూపాయల డబ్బు రైతన్న జేబులోకి చేరుతుందన్నారు.ఏ పంటకు డబ్బు అధికంగా ఉంటుందో..అదే పంట వేసి లాభం పొందాలి అని సూచించారు.పంటలు సాగు చేసే ఈ విషయంలో రైతుకు రైతే శత్రువు కాకూడదన్నారు.రైతు వేడుకలను రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.

రైతు వేదికలను పత్తాలు ఆడడానికి, మద్యపాన కేంద్రాలుగా మార్చవద్దని హెచ్చరించారు.అత్యధిక దిగుబడులు సాధించడంలో మా నియోజకవర్గ రైతులు అందరికీ ఆదర్శం అన్నారు.ఆయిల్ ఫామ్ కు మంచి గిరాకీ ఉంది.రైతులు ఆ దిశగా ఆలోచించాలన్నారు.రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version