Telangana: నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి ఉన్నారట.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో ఇప్పటి వరకు 50 శాతం పూర్తయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ తరుణంలోనే… ఆధిక్యంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇక అటు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి. కౌంటింగ్ సందర్భంగా నగరంలో అమల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కౌంటింగ్ పరిసర ప్రాంతంలో సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాల వెలువడే వరకు మూడు షిఫ్ట్ లో బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు.