సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు : రఘునందన్ రావు

-

సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు మార్చడం రాజకీయ పార్టీలకు సర్వ సాధారణమేనని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రఘునందన్ రావు విమర్శించారు.

ముదిరాజ్‌లకు ఏం హామీలు ఇచ్చారో రేవంత్‌ రెడ్డి చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు. తమకు గడీలు ఉన్నాయంటున్నారని, ఉంటే ఎక్కడున్నాయో చూపించాలని అన్నారు. రేపు రేవంత్‌రెడ్డి దుబ్బాక వస్తే తన ఇల్లు చూపిస్తానని చెప్పారు. ఎన్నికల వేళ ఏదైనా మాట్లాడతాం అంటే సరికాదన్న రఘునందన్.. సీఎం పదవిలో ఉన్న రేవంత్‌ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు.

“మొన్న ఆదిలాబాద్‌లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్‌ రెడ్డే. రేవంత్‌ రెడ్డి మొన్న కేరళ ప్రచారానికి వెళ్లినప్పుడు కమ్యూనలిస్టులు అన్నారు. ఇక్కడకు వచ్చి కమ్యూనిస్టులను పొగుడుతారు.. ఏది నమ్మాలి? సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు.” అంటూ రేవంత్పై రఘునందన్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version