కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ అమలు చేసి పంటలకు మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌సిటీ బస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించారు.
సరూర్నగర్ జన జాతర సభ అనంతరం తిరుగు ప్రయాణంలో దిల్‌సుఖ్‌నగర్ వద్ద రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. వారికి కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ, కిసాన్, నారీ శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించారు. రాష్ట్రంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా ఉంది అంటూ మహిళలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
BIG BREAKING ⚡
India's to-be PM Rahul Gandhi alongwith Telangana CM Revanth Reddy travelled in a Govt bus.
He also explained Nyay Guarantees to locals & distributed Congress Manifesto 🔥
This is the best thing you will watch today, what a man he is ❤️#RahulParBharosaHai pic.twitter.com/jHMa9aGzlN
— Ankit Mayank (@mr_mayank) May 9, 2024