తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు అధికారులు కూడా ఓటు వేస్తున్నారు. సామాన్య పౌరులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలంతా ఓటు వేయడానికి కదలి రావాలంటూ పలువురు కీలక నేతలు సోషల్ మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశాన్ని నెట్టింట పోస్టు చేశారు. అదేంటంటే..?
నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి! అంటూ రాహుల్ ఎక్స్ మాధ్యమం వేదికగా పోస్టు చేశారు.
నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు.
నా తెలంగాణ సోదర సోదరీమణులారా!
రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి.బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి!
Today, Prajala will defeat Dorala!
Brothers and sisters of Telangana, step out and vote in large… pic.twitter.com/yvrvNMBziX
— Rahul Gandhi (@RahulGandhi) November 30, 2023
మరోవైపు ప్రియాంకా గాంధీ ట్వీట్ చేస్తూ.. ‘‘మీ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మీ ప్రియమైన వారు తమ జీవితాలను త్యాగం చేసిన మాతృభూమి కోసం ఆలోచించి ఓటు వేయండి. నిజమైన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు చూపించగల వారికి అవకాశం ఇవ్వండి.’’ అని కోరారు.
నా తెలంగాణ సోదర సోదరీమణులారా..
మా తల్లులారా..పిల్లలారా
మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత.
ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి.
అభినందనలు
జై తెలంగాణ
జై హింద్तेलंगाना की… pic.twitter.com/w1kyvKKl8K
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 30, 2023