ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని నిరసన తెలిపే క్రమంలో అరెస్టయిన (ఎన్ఎస్ యూఐ) నేతలను టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఇతర నాయకులు సోమవారం చంచల్గూడ జైలులో పరామర్శించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటన కు అనుమతి ఇవ్వాలని నిరసన తెలిపే క్రమంలో అరెస్టు అయిన ఎస్ఎస్ యూఐ నేతలను టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఇతర నాయకులు సోమవారం చంచల్గూడ జైలులో పరామర్శించారు.
ఒకవేళ ఎన్ఎస్ యుఐ నేతలు రాహుల్ గాంధీ పర్యటన లోపు విడుదల కాకుంటే ఈ నెల 7న వారిని పరామర్శించేందుకు ఆయన జైలుకు వస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జైలు సూపరిండెంట్ కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అత్యంత క్రియాశీలక పాత్ర అని తెలిపారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల నెరవేర్చారని చెప్పారు. రాహుల్ గాంధీ ఆరవ తేదీ వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారని చెప్పారు.