తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల వేళలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తుంది.మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కి ధీటుగా రోజు మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మరోవైపు బీజేపీ అయితే ఇంకా మేనిఫెస్టో ను కూడా ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత తెలంగాణ పర్యటన ఖరారు అయింది. నవంబర్ 17 న రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. పాలకుర్తి, వరంగల్ , భువనగిరిలో నిర్వహించనున్న సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. తెలంగాణలో వివిధ తేదీలలో ఆరు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకేరోజు రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున గారికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశాలున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ మల్లికార్జున తేదీలను పార్టీ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ అగ్రనేతల పర్యటనలు ఉండే విధంగా కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.