తెలంగాణ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు. వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని ఆయన భయపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు వెంటబడతామని వ్యాఖ్యానించారు కవిత.
ఛత్తీస్ ఘడ్ మావోయిస్టుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం.. నిన్న సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి చాపర్ లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రబా హోటల్ లో కాసేపు విశ్రాంతి తీసుకొని 7.30 వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.