అహ్మదాబాద్ ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంగ్లండ్ పై 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్ గా నిలిచారు. ఆ తరువాత స్థానంలో సచిన్ 3990 పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తంగా 545 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 27వేలకు పైగా పరుగులు చేశారు.
గత కొంత కాలంగా కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. గత 12 ఇన్నింగ్స్ లో అతడు చేసిన పరుగులు వరుసగా 4, 01, 05, 100*, 07, 11, 03, 36, 05, 17, 06, 06 పరుగులు చేశాడు. అయితే సొంతగడ్డ పై ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లోనైనా కోహ్లీ ఫామ్ లోకి వస్తాడని భావిస్తే.. మోకాలి గాయం కారణంగా నాగ్ పూర్ వేదికగా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. కటక్ లో జరిగిన రెండో వన్డేతో పునరాగమనం చేసిన కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు.