తెలంగాణ ప్రజలకు అలర్ట్. బంగాళాఖాతంలో ఆవర్తనం కారణంగా 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హైదరాబాద్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది.
రేపు, ఎల్లుండి మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలో అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతుంది. దీంతో ఉదయం రోడ్లపైకి వచ్చిన నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలపై వెళ్లేవారు నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం బెటర్. అటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.