చిన్నప్పటి నుంచే ఆ భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న ప్రియాంక చోప్రా..!

-

గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యే సమయంలోనే హాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో అక్కడికి మకాం మార్చేసింది ఈ ముద్దుగుమ్మ. దాంతో గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు ఘడించింది. 1982 జూలై 18న జార్ఖండ్లో జన్మించిన ఈమె వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. అయితే ఈమె చిన్నప్పటినుంచి ఒక నయం కానీ భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకెళితే.. ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె ఆస్తమాబారిన పడ్డారట. ఇలా చాలాసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు స్వయంగా ఆమె చెప్పింది. అయితే ఈ సమస్య తనను స్టార్ హీరోయిన్ గా మార్చే తరుణంలో ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అని వెల్లడించింది. ఇకపోతే తనను తాను రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు తన దగ్గర ఇన్హేలర్ ను ఉంచుకుంటానని దానివల్లే తన కెరియర్ కు అడ్డు రాలేదు అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే తాను ఆస్తమాతో బాధపడుతున్నాను అని చెప్పడంతో అభిమానులు సైతం కలవర పడుతున్నారు.

ఇక ప్రియాంక కెరియర్ విషయానికి వస్తే.. 2003లో హీరో అనే చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన ఈమె ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల పైన దృష్టి పెట్టింది. ఇక 2018లో నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న ఈమె అక్కడే అమెరికాలో తన భర్తతో సెటిల్ అయింది.. కానీ ఈమధ్య తన కుమార్తె మాల్తీ తో కలిసి భారతదేశానికి వచ్చింది. అయితే ప్రియాంక 2022 జనవరిలో సరోగసీ ద్వారా ఈ కుమార్తెకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version