Telangana : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని అల్లూరి, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
అలాగే.. వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక అటు తెలంగాణలో గత కొన్ని రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు తీవ్రమైన ఎండ, ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక రాత్రయితే చాలు ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారుజామున చలి మరింతగా పెరుగుతోంది.