వరుణ్‌-లావణ్య పెళ్లిలో మనవరాలితో చిరంజీవి దంపతులు.. ఫొటో వైరల్‌

-

ఇటలీ వేదికగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా సాగింది ఈ వేడుక. టస్కానీ వేదికగా బుధవారం రాత్రి ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలకు చెందిన హీరోలంతా పాల్గొన్నారు.  పెళ్లి వేడుకల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, వైష్ణవ్‌ తేజ్‌, హీరో నితిన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వేడుకలో చిరంజీవికి సంబంధించిన ఓ ఫొటో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. అదేంటంటే.. తన భార్య సురేఖతో కలిసి చిరు.. తన మనవరాలు క్లీంకారతో ఆడుకున్నాడు. మనవరాలితో జాలీగా టైం స్పెండ్ చేస్తున్న ఈ తాతా నానమ్మల ఫొటో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఫిదా చేస్తోంది. రామ్ చరమ్- ఉపాసనల గారాల పట్టి క్లీంకారను చిరంజీవి దంపతులు ఒళ్లో కూర్చొబెట్టుకుని ఆడిస్తుండటం భలే క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. సో క్యూట్.. సో బ్యూటీఫుల్.. వావ్.. వాట్ ఏ సీన్ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో తమ ప్రేమను కురిపించేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version