తెలంగాణ ప్రజలకు అలర్ట్..ఇవాళ, రేపు భారీ వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరియు రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక మంగళవారం అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలంతు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నిన్నటి రోజున హైదరాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల తదితర జిల్లాలలో వర్షాలు పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version