లాయర్ తో కలిసి విచారణకు హాజరైన రాజ్ పాకాల

-

జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసుకు సంబందించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు సమయం కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అతనికి రెండు రోజుల సమయం ఇచ్చింది. ఇవాళ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

మోకిల పోలీసుల ఎదుట విచారణకు రాజ్ పాకాల హాజరయ్యారు. తన లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. రేవ్ పార్టీకి సంబంధించి రాజ్ పాకాలకు ఆదివారం మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ చేపట్టాల్సి ఉందని నోటీసులలో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు పోలీసులు రాజ్ పాకాలను విచారించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో ఏమైనా సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version