రేవంత్ ఓ బ్లాక్ మెయిల్.. వ్యాపారాలు లేనిది డబ్బులు ఎలా సంపాదిస్తున్నావ్ – కోమటిరెడ్డి

-

రేవంత్ ఓ బ్లాక్ మెయిల్.. వ్యాపారాలు లేనిది డబ్బులు ఎలా సంపాదిస్తున్నావని రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. నా లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా స్పీకర్ కి ఇవ్వలేదు..చంద్ర బాబు కి ఇచ్చి నాటకం చేయలేదా ? అని రేవంత్ పై మండిపడ్డారు. నా లాగా పార్టీకి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు పోవాల్సిందని.. సోనియా గాంధీని ఎప్పుడు నేను అగౌరవ పరచలేదని ఫైర్ అయ్యారు.

బలి దేవత అని నువ్వే అన్నావు.. బీజేపీ..trs..టీడీపీ నుండి నాలుగో పార్టీ కాంగ్రెస్ అని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి తనలా ధైర్యంగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా చంద్రబాబుకి ఇచ్చారని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలకు భయపడే రాజీనామా నాటకం చేశాడని అన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. రేవంత్ రెడ్డి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తాడని ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడి ముసుగులో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version