ఈటెల రాజేందర్ తో ముగిసిన రాజగోపాల్ రెడ్డి భేటీ

-

హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బిజెపి హై కమాండ్ శనివారం ఢిల్లీకి పిలిపించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మూడు గంటలకు పైగా వీరితో భేటీ జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి కొద్ది నెలలలో ఎన్నికల శంఖారావం మోగబోతున్న సందర్భంలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించడంలో ప్రధాన పార్టీలు బిజీ అయిపోయాయి.

అమిత్ షా తో వీరి భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలోని పరిస్థితులపై అధిష్టానం ఆరా తీసింది. అయితే శనివారం అమిత్ షా తో భేటీ అనంతరం ఆదివారం రాజగోపాల్ రెడ్డి – ఈటెల సమావేశం అయ్యారు. వీరిద్దరూ భవిష్యత్తు పర్యటన పై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వీరు పార్టీ మారతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version