న్యూ ఇయర్‌ వేడుకలపై రాజాసింగ్ హాట్‌ కామెంట్స్‌..ఇది బ్రిటీష్ రూల్‌ అంటూ !

-

న్యూ ఇయర్‌ వేడుకలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కొత్త సంవత్సరం పేరుతో గోవాకు, క్లబ్, పబ్బ్ లకు వెళ్ళడమేనా మన సంస్కృతి అంటూ ఆగ్రహించారు. జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరమని బ్రిటీష్ పాలకులు మన పైన రుద్ది వెళ్లారని ఫైర్ అయ్యారు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.

Rajasingh

ఇవాళ మీడియాకు ఓ వీడియోను రిలీజ్‌ చేసి.. ఈ వ్యాఖ్యలు చేశారు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మనకు కొత్త సంవత్సరం జనవరి ఒకటోతారీఖు కాదన్నారు. ఉగాది మన హిందువులకు కొత్త సంవత్సరం అని తెలిపారు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ కొత్త సంవత్సరం పేరుతో మన భవిష్యత్తు తరాలకు విదేశీ కల్చర్ ను అలవాటు చేస్తున్నారని ఆగ్రహించారు. డిసెంబర్ 31..జనవరి 1 కొత్త సంవత్సరం ఈవెంట్స్ పేరుతో హిందువులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని తెలిపారు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఉగాది కొత్త సంవత్సరం అని మన భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news