కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ట్విస్ట్ ఇచ్చింది హైకోర్టు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో కేటీఆర్ తరపు లాయర్ వాదనలు పూర్తయ్యాయి. ఇక విచారణ మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది హైకోర్టు.. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేర్చినప్పుడు FEOను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని వెల్లడించారు కేటీఆర్ లాయర్.
అయితే… ఈ కేసులో కోర్టు ముందు కేటీఆర్ తరపు న్యాయవాది కీలక అంశాలు ఉంచారు. డిసెంబర్ 18 సాయంత్రం 5:30కి కంపిటేoట్ అదారిటీ నుండి ఏసీబీ కి అనుమతి వచ్చింది… డిసెంబర్ 19న ఏసీబీ FIR నమోదు చేసిందన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఆయాయి ఆన్నది అవాస్తవం అని తెలిపారు. అప్పటి మున్సిపల్ మంత్రిగా నా ముందు పెట్టిన ఫైల్ పై సoతకం చేసినందుకు నిందితుడుగా చేర్చారన్నారు కేటీఆర్ తరపు న్యాయవాది. అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ ఫైల్ పై సంతకం చేశారు, అంత మాత్రాన నిందితుడిగా చేరుస్తారా…? ఈ మొత్తం వ్యవహారం లో కేటీఆర్ లబ్ధి పొందలేదని తెలిపారు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందన్నారు కేటీఆర్ తరపు న్యాయవాది.