2024 ఎన్నికల్లో విపక్షాల ప్రచార ఖర్చు మొత్తం భరిస్తానన్న కేసీఆర్?..వీడియో వైరల్

-

సీఎం కేసీఆర్ ఏది చేసినా దాని వెనుక ఓ వ్యూహం ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజకీయాల గురించి ఆలోచిస్తారు. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశ రాజకీయాల్లోకి కే‌సి‌ఆర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రంలో కూడా చక్రం తిప్పాలనే దిశగా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. ఇక నిదానంగా బి‌ఆర్‌ఎస్ పార్టీని అన్నీ రాష్ట్రాల్లో విస్తరిస్తూ వెళుతున్నారు.

ప్రస్తుతం కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా, తమిళనాడు లాంటి రాష్ట్రాలపై కే‌సి‌ఆర్ ఫోకస్ పెట్టారు. తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టి రాజకీయం నడిపిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొందరు నేతలని బి‌ఆర్‌ఎస్లో చేర్చుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా కెసిఆర్ కు సంబంధించి సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ దేశాయ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకుల ఈగోల గురించి ప్రస్తావించిన రాజ్ దీప్ ప్రతినేత కూడా తమను తాము జాతీయ నేతగానే భావిస్తున్నారని అన్నారు.

 

కేసీఆర్ ను తీసుకుంటే ఆయన తన టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ కన్వర్జేషన్ లో కెసిఆర్ తన సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్ ను చేస్తే 2024 ఎన్నికల మొత్తం ఖర్చు భరించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అయితే ఇందుకు ప్రతిపక్షాలలో కేసీఆర్ కు సమకాలికంగా ఉన్న నాయకులు అంగీకరిస్తారా? అని రాజ్ దీప్ పేర్కొన్నారు. ఇంకా ప్రతిపక్షాల కూటమి ఉంటుందా? అనే దానికి సంబంధించి వివిధ అంశాలను ఆ వీడియోలో రాజ్ దీప్ ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version